Medical Staff Negligence Mother and Twins : ఆధార్‌, హెల్త్‌కార్డుల్లేవని ప్రసవం చేసేందుకు నిరాకరించిన వైద్య సిబ్బంది.. తల్లి, కవలలు మృతి

కర్నాటకలో దారుణం జరిగింది. తుముకూరు జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తల్లి, ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆధార్‌, హెల్త్‌కార్డు లేదని ప్రసవం చేయడానికి నిరాకరించడంతో తల్లి, కవలలు మృతి చెందారు.

Medical Staff Negligence Mother and Twins : కర్నాటకలో దారుణం జరిగింది. తుముకూరు జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తల్లి, ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆధార్‌, హెల్త్‌కార్డు లేదని ప్రసవం చేయడానికి నిరాకరించడంతో తల్లి, కవలలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ గర్భిణికి బుధవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో చుట్టుపక్కలవారు ఆమెను తుముకూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న డాక్టరు, నర్సులు ఆధార్‌కార్డు, హెల్త్‌కార్డు అడిగారు. ఆ సమయంలో ఆమె వద్ద ఆధార్‌కార్డు, హెల్త్‌కార్డు లేవు. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది నిరాకరించారు.

దీంతో గర్భిణి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. అయితే గురువారం తెల్లవారుజామున సదరు మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఈ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు. అంతేకాకుండా పుట్టిన కవల పిల్లలు కూడా మృతి చెందారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డలు మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన మహిళకు ఆరేళ్ల కూతురు ఉందని, ఆ బాలిక పరిస్థితి ఏంటని నిలదీశారు.

Jharkhand: పాపం పసికందు.. వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు కాళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో వైద్యారోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ స్పందించారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న డాక్టర్‌, ముగ్గురు నర్సులను సస్పెండ్‌ చేశారు. అనాథగా మారిన ఆరేళ్ల బాలికకు ఉచిత విద్య, వసతి కల్పిస్తామని ప్రకటించారు. తల్లీబిడ్డల మృతికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ మంత్రి సుధాకర్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు