Jharkhand: పాపం పసికందు.. వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు కాళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు

జార్ఖండ్ రాష్ట్రం గిరిధ్ జిల్లా ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు ప్రాణాలమీదకొచ్చింది. రెండు రోజుల పసికందు కాళ్లను ఎలుకలు ...

Jharkhand: పాపం పసికందు.. వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు కాళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు

Rats Eat Newborn

Jharkhand: జార్ఖండ్ రాష్ట్రం గిరిధ్ జిల్లా ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు ప్రాణాలమీదకొచ్చింది. రెండు రోజుల పసికందు కాళ్లను ఎలుకలు కొరుక్కుతున్నాయి. ప్రస్తుతం పసికందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటన పై జిల్లా వైద్యాధికారులు సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశించారు. ఇద్దరు నర్సులను విధుల నుంచి తొలగించి, డ్యూటీలో ఉన్న డాక్టర్ పై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 29న మమతాదేవి అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం గిరిధ్ జిల్లా ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డుకు వైద్యులు తరలించారు. అయితే ఆ పసికందును పరీక్షించిన వైద్యులు పాప జాండిస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో పాపకు అక్కడే చికిత్స అందిస్తున్న క్రమంలో ఎలుకలు మోకాళ్ల కింది భాగంలో దారుణంగా కొరికాయి.

Rats In Kamareddy Hospital : బాబోయ్ ఎలుకలు.. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో భయం, భయం

చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్‌బాద్‌లోని షాహీద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై పసికందు తండ్రి అశోక్ సింగ్ మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం హుటాహుటీన ధన్‌బాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారని అన్నారు. అయితే శిశువు కాళ్లు, చేతులు, తలపై రక్తపు మరకలతో కట్టుకట్టి ఉండటం చూసి భయపడ్డామని తెలిపాడు. ఏం జరిగిందో అర్థంకాక పీఎంసీహెచ్‌ వైద్యులను అడగగా తమ బిడ్డ కాళ్లు, చేతులు, తలపై కూడా ఎలుకలు కరిచినట్లు తెలిపారని అన్నాడు. అయితే భూమికి నాలుగు అడుగుల ఎత్తులో ఇంక్యుబేటర్‌లో ఉంచినప్పటికీ ఎలుకలు పసికందుపై దాడిచేయడం వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అశోక్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రి సిబ్బందిపై ఉందని, అయితే వారు అలా చేయడంలో విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Omicron In Rats : ఎలుకల్లో ఒమిక్రాన్‌.. ఆ తర్వాతే మనుషులకొచ్చిందా?!

తొలుత వైద్యులు శిశువును ఎలుకలు కరిచాయని ఒప్పుకోలేదు.. దీంతో స్థానికంగా కొందరు సామాజిక కార్యకర్తలు జోక్యం చేసుకొని విషయంపై వైద్యులను నిలదీయగా రాత్రి సమయంలో పసికందును ఎలుకలు కరిచినట్లు అంగీకరించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సర్జన్ ఎస్పీ మిశ్రా తెలిపారు. ఇంకా నివేదికలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు.