Omicron In Rats : ఎలుకల్లో ఒమిక్రాన్‌.. ఆ తర్వాతే మనుషులకొచ్చిందా?!

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ముందు ఎలుకల్లో వృద్ధి చెంది మనుషుల్లోకి వచ్చిందా?

Omicron In Rats :  ఎలుకల్లో ఒమిక్రాన్‌.. ఆ తర్వాతే మనుషులకొచ్చిందా?!

Omicron Evolved In Rats

Omicron evolved in rats: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ముందు ఎలుకల్లో వృద్ధి చెంది ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించడానికి ఉపయోగపడే ఏడు ఉత్పరివర్తనాలు ఒమిక్రాన్‌లో ఉన్నాయని చెబుతున్నారు. వైరస్‌ అనేక ఉత్పరివర్తనాలకు లోనై తిరిగి మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు.పరిశోధకుల భావన ప్రకారం..2020 మధ్య కరోనా సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ మానవుల నుంచి ఎలుకల్లోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని ‘రివర్స్‌ జూనోసిస్‌’ అంటారని తెలిపారు. ఇలా ఎలుకల్లో ప్రవేశించిన ఆ వైరస్‌ అనేక ఉత్పరివర్తనాలకు లోనై ఇలా ఒమిక్రాన్ గా రూపాంతరం చెంది ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read more : Omicron In 38 Countries : 38 దేశాలకు పాకిన ఒమిక్రాన్..!జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తోంది..!!

ఈ మార్పుల అనంతరం వైరస్‌ తిరిగి అది మనుషులలోకి ప్రవేశించి ఉండొచ్చు అని అంటున్నారు. దీన్ని ‘జూనోసిస్‌’గా పేర్కొంటారు.చాలాకాలం కిందటే ఇతర కరోనా వేరియంట్లకు భిన్నంగా ఒమిక్రాన్‌ రూపాంతరం చెందడం మొదలుపెట్టిందని భావిస్తున్నారు. ఇది కేవలం మా భావన మాత్రమే కాదని దానికి కొన్ని ఆధారాల వల్ల అలా భావించాల్సి వస్తోందన్నారు. తమ భావన బలపరిచే ఆధారం ఇదేనని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇమ్యునాలజిస్టు క్రిస్టియన్‌ ఆండర్‌సన్‌ తెలిపారు.

ఈ వేరియంట్‌ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తిలో పరిణామం చెంది ఉంటుందన్న మరో సిద్ధాంతం కూడా ఉందని ఆయన తెలిపారు. వీటన్నింటి కన్నా ‘రివర్స్‌ జూనోసిస్‌, జూనోసిస్‌’కే ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. కొత్త వేరియంట్లలో వచ్చిన ఉత్పరివర్తనాలు చాలా అసాధారణంగా ఉండటం మా వాదనను బలం చేకూరుస్తోందని ఆండర్​సన్ చెప్పారు. ఎలుకల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించడానికి ఉపయోగపడే ఏడు ఉత్పరివర్తనాలు ఒమిక్రాన్‌లో ఉన్నాయన్నారు.

Read more : Omicron In India : భారత్‌లో మూడవ ఒమిక్రాన్‌ కేసు నమోదు..

ఆల్ఫా వంటి మిగతా రకాల్లో కొన్ని మాత్రమే ఉన్నాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్​ను బి.1.1.529గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్​ చాలా అసాధారణమైన వైరస్ ఉత్పరివర్తనాల కలయిక అని..ఇది రోగనిరోధక శక్తిని బురిడీ కొట్టింది.. విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.

ఈ కొత్త వేరియంట్ కు వ్యాక్సిన్ల శక్తినుంచి కూడా తప్పించుకోగల లేదా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటే..అత్యంత ప్రమాదంగా మారే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారరు. ఒమిక్రాన్‌ను ‘ప్రపంచస్థాయి ఆందోళన కలిగించే వైరస్‌ రూపాంతరం’గా(వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​) డబ్యూహెచ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే.