Omicron In 38 Countries : 38 దేశాలకు పాకిన ఒమిక్రాన్..!జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తోంది..!!

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ 38 దేశాలకు వ్యాపించిపోయింది.

Omicron In 38 Countries : 38 దేశాలకు పాకిన ఒమిక్రాన్..!జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తోంది..!!

Omicron Variant Corona

Omicron Variant Corona : కరోనా కేసుల తగ్గాయని సంతోషించనంత పట్టలేదు. పలు రూపాలు మార్చుకుంటు..తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ గా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ ఒమిక్రాన్ 38 దేశాలకు వ్యాపించిపోయింది. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా ఇది విస్తరిస్తోంది. జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసే పనిలోపడిపోయింది..

కెనడాలో ఈ తరహా కేసులు 15కు చేరాయి. దేశంలో తొలికేసు గతనెల 28న నమోదయింది. ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి ఒంటారియకు వచ్చిన ఇద్దరికి ఈ వైరస్‌ సోకింది. అటు 12 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, కరోనా కొత్త Omicron వేరియంట్ ప్రపంచంలోని 38 దేశాలకు వ్యాపించిపోయింది. ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను..ముఖ్యంగా దక్షిణాఫ్రికానుంచి వచ్చే విమానాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువుతున్నాయి.

Read more : Omicron : అమెరికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..న్యూయార్క్ లో కొత్తగా ఐదు

ఒమిక్రాన్ తో ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు నమోదు కాకపోయినా ప్రమాదం మాత్రం పొంచి ఉందని కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలిచ్చింది. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు రీ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయని కాబట్టి మాస్కులు తప్పనిసరి అని ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమాత్రం నిర్లక్షం చేయవచ్చని పదే పదే సూచిస్తోంది.

ఈక్రమంలో ఒమిక్రాన్‌…క్రమంగా విస్తరిస్తూనే ఉంది. జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసే పనిలోపడిపోయింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ బారినపడి ఎవ్వరూ మృతిచెందకపోవడం సంతోషించాల్సిన విషయం. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వ‌ర‌కు 38 దేశాలకు వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఈ వేరియంట్ ఆందోళ‌న‌క‌ర‌మేనని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో.. ఒమిక్రాన్‌ మరణాలు నమోదు కాలేదని వెల్లడించింది.

Read more : International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

తాజా పరిస్థితిపై డ‌బ్ల్యూహెచ్‌వో టెక్నిక‌ల్ హెడ్ మారియా వాన్ ఖేర్‌కోవ్ ఓ నివేదిక ఇ్చారు.. ఇప్పటి వరకు 38 దేశాల్లో న‌మోదు ఈ తరహా కేసులు వెలుగుచూశాయని వెల్లడించారు. కాగా..ఒమిక్రాన్‌ వేరియంట్‌ నివారణ చర్యల్లో భాగంగా.. పలు దేశాలు విదేశీ ప్రయాణికుల విషయంలో కొత్త ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో భారత్ కూడా డిసెంబర్​ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది.

Read more : Omicron Threat : అక్కడ 90 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌‌.. భయాందోళనలో ప్రజలు

Read more : Omicron : గుడ్ న్యూస్.. ఇప్పటివరకు ఒమిక్రాన్‌తో ఒక్కరు కూడా చనిపోలేదు