Omicron : గుడ్ న్యూస్.. ఇప్పటివరకు ఒమిక్రాన్‌తో ఒక్కరు కూడా చనిపోలేదు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు చెప్పడం మరింత ఆందోళ

Omicron : గుడ్ న్యూస్.. ఇప్పటివరకు ఒమిక్రాన్‌తో ఒక్కరు కూడా చనిపోలేదు

Omicron Who

Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ దడ పుట్టిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బిగ్ రిలీఫ్ ఇచ్చే విషయాన్ని చెప్పింది.

ఇప్పటివరకు ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్‌తో మరణించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. ఏ దేశంలోనూ ఒమిక్రాన్ మరణాలు సంభవించలేదని తెలిపింది. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తిస్తున్న దేశాల జాబితా పెరుగుతూనే ఉందంది. ఈ వేరియంట్ కారణంగా మరణం సంభవించినట్టు ఇప్పటివరకు తమకు రిపోర్టులు రాలేదని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని అర్థమవుతున్నదని వివరించింది. కాగా, గత 60 రోజుల నుంచి అందిన సమాచారం ప్రకారం 99.8శాతం జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల్లో కేవలం డెల్టా వేరియంట్ కేసులే వచ్చాయని WHO చెప్పింది.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి ప్రపంచ దేశాల నుంచి విస్తృతస్థాయిలో సమాచారం సేకరిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ”ఒమిక్రాన్ తో ఎక్కడా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ఓమిక్రాన్ కారణంగా మరణించినట్టు ఒక్క రిపోర్టు కూడా ఇప్పటివరకు చూడలేదు. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ నేపథ్యంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నందు వల్ల మరిన్ని కేసులు గుర్తించగలం. మరింత సమాచారాన్ని తెలుసుకోగలం. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇప్పటిదాకా అధిక తీవ్రత, అత్యంత ప్రభావం చూపిన వేరియంట్ మాత్రం డెల్టానే” అని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్ మెయిర్ జెనీవాలో అన్నారు.

Booster Dose : దేశంలో 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్!

ఒమిక్రాన్ తీవ్రత ఏ పాటిదన్న అంశంపై ప్రకటన చేసేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని, ఒమిక్రాన్ సంక్రమణ వేగం, వ్యాధి లక్షణాల తీవ్రత, దీనిపై వ్యాక్సిన్ల పనితీరు, చికిత్సకు స్పందించే తీరును ఇప్పట్లో చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి స్పష్టం చేశారు.