IND A vs SA A : విజృంభించిన భారత బౌలర్లు.. కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగుల ఆధిక్యం
దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత-ఏ (IND A vs SA A) జట్టు పేసర్లు విజృంభించారు.
India A vs South Africa A 2nd Unofficial Test india lead 34 runs
IND A vs SA A : దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పేసర్లు విజృంభించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాప్రికా 47.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 34 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
సఫారీ బ్యాటర్లలో మార్క్స్ అకెర్మాన్ (134; 118 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ బాదాడు. జోర్డాన్ హెర్మాన్ (26), ప్రేనేలన్ సుబ్రాయెన్ (20) మినహా మరే బ్యాటర్ కూడా రెండు అంకెల స్కోరు సాధించలేదు. కెప్టెన్ టెంబా బవుమా సహా నలుగురు డకౌట్లయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ లు చెరో రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబె లు చెరో వికెట్ సాధించారు.
Hong Kong Sixes 2025 : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. హ్యాట్రిక్‌తో పాటు..
అంతకముందు భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ధ్రువ్ జురెల్ (132; 175 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ) సెంచరీ చేశాడు. సీనియర్లు కేఎల్ రాహుల్ (19), సాయి సుదర్శన్ (17), అభిమన్యు ఈశ్వరన్ (0), దేవదత్ పడిక్కల్ (5), రిషబ్ పంత్ (24) విపలం అయ్యారు.
కాగా.. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్-ఏ 1-0 ఆధిక్యంలో ఉంది.
