Rats In Kamareddy Hospital : బాబోయ్ ఎలుకలు.. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో భయం, భయం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఘటన నుంచి వైద్య శాఖ అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది.(Rats In Kamareddy Hospital)

Rats In Kamareddy Hospital : బాబోయ్ ఎలుకలు.. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో భయం, భయం

Rats In Kamareddy Hospital

Rats In Kamareddy Hospital : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఘటన నుంచి వైద్య శాఖ అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. మరో ప్రభుత్వ ఆసుపత్రిలోనూ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనం ఇస్తున్నాయి.

ఎంజీఎం ఆసుపత్రి ఘటన మరువక ముందే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఎలుకల స్వైర విహారం టెన్షన్ పెట్టిస్తోంది. ఐసీయూ, ట్రామా కేర్ సెంటర్ లో విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతున్నాయి. ఐసీయూలోని ఆక్సిజన్ పైప్ లైన్లపైకి ఎలుకలు దూకతున్నాయి. దీంతో పేషెంట్ల భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రిలో ఎలుకల స్వైర విహారానికి సంబంధించిన దృశ్యాలు అందరినీ కంగారు పెడుతున్నాయి.(Rats In Kamareddy Hospital)

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు టెన్షన్ పడుతున్నారు. ఎలుకలు మీదకు దూకుతుండటంతో భయపడుతున్నారు. దీనిపై రోగులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుకలు లోనికి రాకుండా చర్యలు తీసుకోవాని కోరారు. అయినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని రోగులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎలుకలు ఇలా లోనికి వస్తున్నాయని వారు ఆరోపించారు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి ఎలుకలు లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు.

Warangal : MGM సూపరింటెండెంట్ బదిలీ.. ఇధ్దరు వైద్యుల సస్పెన్షన్

ఎంజీఎం.. వరంగల్​ జిల్లాలో పేరొందిన ప్రభుత్వ ఆసుపత్రి. ఎంతోమంది రోగుల ప్రాణాలు నిలుపుతున్న ఎంజీఎం.. కొందరు రోగులకు మాత్రం ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పెద్దాసుపత్రికి వచ్చిన రోగులకు ప్రాణాల మీద ఆశలు లేకుండా చేస్తోంది. దీనికి కారణం ఎలుకలే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులపై ఎలుకలు దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకునే లోపు.. రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

కొన్నిరోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాళ్లు, చేతుల వేళ్ల ఎలుకలు కొరికేశాయి. దీంతో రోగికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. రోగి బంధువులు ఫిర్యాదు చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదు. రోగిని ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. మరో ఇద్దరు వైద్యులపైనా చర్యలు తీసుకుంది. దీనిపై విపక్షాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డాయి.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో దారుణం.. పేషెంట్‌‌పై ఎలుకల దాడి.. తీవ్ర రక్తస్రావం..!

ఐసీయూలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే విషయంపై అధికారులు ఆరా తీశారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనులు సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఆస్పత్రిలో డ్రైనేజీ, పారిశుధ్య పనులను మెరుగుపర్చాలని సిబ్బందిని ఆదేశించారు.

ఇంత జరిగినా వైద్య శాఖ అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదని చెప్పడానికి కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోని దృశ్యాలే నిదర్శం అని జనాలు అంటున్నారు. మరో ఘోరం జరక్కముందే అధికారులు మేల్కోవాలని, ఎలుకలను కట్టడి చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.