Mukesh Ambani : ముకేశ్ అంబానీకి మూడో సారి బెదిరింపు…ఈ సారి రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు....

Mukesh Ambani death threat

Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బిలియనీర్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు. తొలుత రూ.20 కోట్లు, రెండవసారి రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఆగంతకుడి కోసం ముంబయి పోలీసుల దర్యాప్తు

గతేడాది బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి అంబానీకి, అతని కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించారు. ఇంతకు ముందు పంపిన రెండు ఈ మెయిల్స్‌కు రెస్పాన్స్ రాకపోవడంతో ఆగంతకుడు రూ.400 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. అంబానీ కంపెనీకి సోమవారం ఈమెయిల్ వచ్చింది. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సైబర్ బృందాలు ఈమెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

పలుసార్లు బెదిరింపులు…

భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటి వరకు పలుసార్లు ముకేశ్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. ముకేశ్ అంబానీ నుంచి ఆగంతకుడు రూ. 200 కోట్లు డిమాండ్ చేశాడు.

డిమాండ్ పెంచిన ఆగంతకుడు

మునుపటి బెదిరింపు ఈమెయిల్‌కు స్పందించక పోవడంతో, ఆ మొత్తాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచినట్లు ముంబయి పోలీసులు చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని శుక్రవారం బెదిరించిన ఈమెయిల్ ఖాతా నుంచి మరో హత్య బెదిరింపు వచ్చింది.

డబ్బులివ్వకుంటే చంపేస్తామంటూ హెచ్చరిక

‘‘మీరు మా ఈమెయిల్‌కు ప్రతిస్పందించలేదు. ఇప్పుడు ఆ మొత్తం రూ. 200 కోట్లు, లేకపోతే డెత్ వారెంట్‌పై సంతకం చేస్తాం’’ అని ఈ మెయిల్ లో ఆగంతకుడు హెచ్చరించాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.

Also Read : German tattoo artist Shani Louk : హమాస్ మరో దారుణం…జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్‌ను కిడ్నాప్ చేసి ఏం చేశారంటే…

అంబానీకి హత్య బెదిరింపు ఈమెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తమ వద్ద అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, తమకు రూ.20కోట్లు ఇవ్వకుంటే హతమారుస్తామని ఈమెయిల్ లో బెదిరించారు. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా ముంబయిలోని గామ్‌దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్‌లు 387, 506(2) కింద కేసు నమోదు చేశారు.

Also Read : Police Arrest : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో డ్రగ్స్ విక్రేత ఏం చేశాడంటే…షాకింగ్ సీన్

ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది బీహార్‌లోని దర్భంగాకు చెందిన వ్యక్తి ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు అరెస్టయ్యాడు. నిరుద్యోగి అయిన నిందితుడిని రాకేష్ కుమార్ మిశ్రాగా గుర్తించారు.

Also Read :    Onion Prices : దేశంలో ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు…తెరవెనుక కథ

ముంబయిలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని, ముఖేష్‌ అంబానీ కుటుంబాన్ని బెదిరించాడు. 2021వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ దక్షిణ ముంబయి నివాసం యాంటిలియా వెలుపల 20 పేలుడు జెలటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో కూడిన స్కార్పియో కారును కనుగొన్నారు.