Police Arrest : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో డ్రగ్స్ విక్రేత ఏం చేశాడంటే…షాకింగ్ సీన్

పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తే ఆ భయంతో డ్రగ్స్ విక్రేత అయిన నిందితుడు ఏకంగా నదిలో దూకిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.....

Police Arrest : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో డ్రగ్స్ విక్రేత ఏం చేశాడంటే…షాకింగ్ సీన్

Man Jumps into River

Police Arrest : పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తే ఆ భయంతో డ్రగ్స్ విక్రేత అయిన నిందితుడు ఏకంగా నదిలో దూకిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ పట్టణంలో ఖాన్ అనే వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. డ్రగ్స్ కేసులో నిందితుడైన ఖాన్ కు నోటీసు ఇచ్చి అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వచ్చారు.

Also Read : German tattoo artist Shani Louk : హమాస్ మరో దారుణం…జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్‌ను కిడ్నాప్ చేసి ఏం చేశారంటే…

పోలీసులను చూసిన ఖాన్ అరెస్ట్ చేస్తారనే భయంతో ఇంట్లో నుంచి మరో ద్వారం గుండా తప్పించుకొని పరుగెత్తుతూ ఏకంగా నదిలోకి దూకాడు. ఖాన్ నదిలోకి దూకి, ఈదుకుంటూ అవతలి వైపునకు వెళ్లి పోలీసుల బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. నది ఒడ్డున ఉన్న పోలీసులు నిందితుడు ఖాన్ ను ఒడ్డుకు రమ్మని విజ్ఞప్తి చేసినప్పటికీ నిందితుడు నదిలో నుంచి బయటకు రావడానికి నిరాకరించారు.

Also Read : Maratha Quota : మరాఠా రిజర్వేషన్ డిమాండ్ ఉద్యమం…బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం వెలుగుచూసింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నిందితుడు నదిలో ఈదుకుంటూ మరో ఒడ్డుకు చేరుతున్న వీడియోను ఒకరు తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖాన్ డ్రగ్స్ విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Also Read : Harish Rao : గన్‌మెన్ అలర్ట్‌గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది- హరీశ్ రావు

డ్రగ్స్ విక్రేత ఖాన్ పై సెక్షన్ 110 సహా పలు ఇతర అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేరస్తుడు ఖాన్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఖాన్ కోసం అన్వేషణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.