Civil engineer turned vegetable seller : లాక్డౌన్ కారణంగా డ్రగ్స్ విక్రేతగా మారిన సివిల్ ఇంజనీర్

లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయి ఉల్లిపాయల వ్యాపారం చేయటం మొదలెట్టి వాటితో పాటు డ్రగ్స్ విక్రేతగా మారి పోలీసులకు చిక్కాడు ఒక సివిల్ ఇంజనీర్.

Civil Engineer Turns Drug Dealer

Civil engineer turned vegetable seller held fortrying to peddle 63 kg marijuana worth Rs 9 lakh seized from his onion godown : లాక్ డౌన్ చాలామంది పరిస్ధితులను తలకిందులు చేసింది. ఉపాధి కోల్పోయిన వారెందరో ఉన్నారు. వ్యాపారంలో నష్టపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవారు ఉన్నారు. కొత్త ఉద్యోగాలవేటలో ఉన్నవారు మరి కొందరు. ఇప్పుడిప్పుడే ప్రజలు సాధారణ పరిస్ధితులకు అలవాటు పడుతున్నారు. లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయి ఉల్లిపాయల వ్యాపారం చేయటం మొదలెట్టి వాటితో పాటు డ్రగ్స్ విక్రేతగా మారి పోలీసులకు చిక్కాడు ఒక సివిల్ ఇంజనీర్.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన సచిన్ సలుంకే సివిల్ ఇంజనీర్ గా ఒడిషాలో టచాలా సంవత్సరాలుపని చేశాడు. లాక్ డౌన్ సమయంలో ఉన్న ఉపాధి పోవటంతో ముంబై వచ్చేశాడు. ఉపాధి కోల్పోవటంతో ఏదో ఒక వ్యాపారంచేసుకుని జీవనంసాగించటానికి సిధ్దపడి కూరగాయల వ్యాపారం చేయటం మొదలెట్టాడు.

కూరగాయలతోపాటు ఉల్లిపాయలు కూడా అమ్మటం మొదలెట్టాడు. మొత్తంగా తన కూరలు ఉల్లిపాయలు సరుకు నిల్వ చేసుకోటానికి ఒక గొడౌన్ అద్దెకు తీసుకుని సరుకు అందులోనిల్వ చేయటం ప్రారంభించాడు. వ్యాపారం సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుంది ఒకరోజు కురార్ పోలీసుస్టేషన్ కు చెందిన పోలీసులు అతని గొడౌన్ పై దాడి చేసి అక్కడ కూరగాయల మధ్య దాచి ఉంచిన డ్రగ్స్ ను,63కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా రూ. 9లక్షలు ఉంటుందని అంచనా.

సలుంకేను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని ప్రశ్నిస్తున్నారు. కూరగాయల వ్యాపారం చేస్తున్న సలుంకే కి త్వరగా డబ్బులుసంపాదించాలనే ఆశపుట్టింది.తను గతంలో పనిచేసిన ఒడిషాలోని కొంతమంది పరిచయస్తుల ద్వారా… అక్కడి నుంచి కూరగాయల మధ్యలో ఉంచి గంజాయి తెప్పించటం మొదలు పెట్టాడు. వాటితోపాటు డ్రగ్స్ కూడా విక్రయించటం మొదలెట్టి పెడ్లర్ గా కూడా మారాడు.

పోలీసులకు అందిన విశ్వసనీయసమాచారం తో సలుంకే గోడౌన్ పై దాడి చేసిన పోలీసులు ఉల్లిపాయల బస్తాల మధ్య దాచి ఉంచిన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్మటం ఇదే మొదటి సారి అని పోలీసులకు తెలిపాడు. నిందితుడిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.