12ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన హెడ్ కానిస్టేబుల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2019 / 02:04 AM IST
12ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన హెడ్ కానిస్టేబుల్

Updated On : October 1, 2019 / 2:04 AM IST

సహోద్యోగి కూతురుని లైంగికంగా వేధించిన కేసులో ముంబైకి చెందిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. ఒకే కాలనీలో నివసిస్తున్న తన సహోద్యోగి 12ఏళ్ల కూతురిని హెడ్ కానిస్టేబుల్ దారుణంగా హించాడు. ప్రైవేట్ పార్ట్స్ లో తాకుతూ బాలికను వేధించాడు. 

ఈ నెల ప్రారంభంలో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్…మీ అమ్మ నాకు ఓ గిఫ్ట్ ఇచ్చింది..నువ్వు నాతో కొంచెం సమయం గడిపితేనే మీ అమ్మ నీకు ఈ గిఫ్ట్ ఇవ్వమంది అంటూ బాలికను అభ్యంతరకరంగా టచ్ చేయడం ప్రారంభించాడు. అయితే బాలిక అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా చాలా సేపు బాలికను వదిలిపెట్టలేదు. చివరకు ఎలాగోలా బాలిక అతడి బారి నుంచి బయటపడిందని పోలీసులు తెలిపారు. బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో పోస్క్ చట్టం కింద నిందితుడైన హెడ్ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.