Wife Got Second Marriage : జైలు నుంచి వచ్చేసరికి భార్యకు రెండో పెళ్లి, గర్భవతి… అత్తను…..!

మహారాష్ట్రలోని ముంబైలో వివిధ పోలీసు స్టేషన్లలో నిందితుడిగా ఉన్నవ్యక్తికి  జైలు శిక్ష పడింది.  జైలు నుంచి విడుదలైన కొద్ది సేపట్లోనే మళ్లీ హత్యచేసి జైలు పాలయ్యాడు.

Wife Got Second Marriage

Wife Got Second Marriage : మహారాష్ట్రలోని ముంబైలో వివిధ పోలీసు స్టేషన్లలో నిందితుడిగా ఉన్నవ్యక్తికి  జైలు శిక్ష పడింది.  జైలు నుంచి విడుదలైన కొద్ది సేపట్లోనే మళ్లీ హత్యచేసి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే ముంబై కి చెందిన ఇక్బాల్ అబ్బాస్ షేక్(42) పై వివిధ పోలీసుస్టేషన్లలో 28 కేసులు ఉన్నాయి.

వాటికి సంబంధించి శిక్ష అనుభవించి గత బుధవారం పూణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాడు. భార్యను వెతుక్కుంటూ అత్త గారింటికి వెళ్లాడు. అక్కడ భార్య కనిపించలేదు.  తన కూతురుకి మళ్లీ పెళ్లి చేశానని…. ఇప్పుడు గర్భవతిగా ఉందని అత్త షమల్‌ శ్యామ్‌ శిగామ్‌ (61) తెలిపింది. దీంతో   కోపోద్రిక్తుడైన అబ్బాస్ షేక్,  పక్కనే  ఉన్ప  పార, కత్తి తీసుకుని అత్త శిగామ్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
Read Also : Family Murder : ప్రియుడి కోసం స్త్రీ గా మారుతానన్నయువకుడు…ఒప్పుకోకపోవటంతో కుటుంబం హత్య

ఈ ఘటనలో అత్త శిగామ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ   ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించారు. తన భార్యను కలుసుకోటానికి వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు  పూణేలో  ఉన్న  నిందితుడిని అరెస్ట్ చేసి మళ్లీ జైలుకు పంపారు.