Pearl V Puri : రేప్ కేసులో టీవీ నటుడు అరెస్ట్

అత్యాచారం, వేధింపుల కేసులో టీవీ నటుడు పెర్ల్ వి పూరీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Arrest

Pearl V Puri : అత్యాచారం, వేధింపుల కేసులో టీవీ నటుడు పెర్ల్ వి పూరీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మైనర్  బాలికపై అత్యాచారం  చేసారనే అరోపణలతో పూరీతో సహా ఆరుగురు నిందితులను పోలీసుల ముంబైలోని మలాద్ లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తనను కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి  కారులో అత్యాచారం చేశారని.. ఆతర్వాత పలుమార్లు పూరీ  అత్యాచారం చేసాడని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి మల్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పెర్ల్ వి పూరీ 2013 లో దిల్ కి నాజర్ సే ఖూబ్ సూరత్ అనే టీవీ సీరియల్‌తో టీవీ రంగంలోకి ప్రవేశించాడు. ఆతర్వాత ఫిర్ భీ నా మనే … బద్తా‌మీజ్ దిల్ సినిమాల్లో నటించాడు. నాగిన్3 తో పాపులర్ అయ్యాడు. నాగార్జున ఏక్ యోధా, బెపనా ప్యార్ వంటి కార్యక్రమాల్లో కనిపించాడు,. తాజాగా బ్రహ్మరాక్షస్ 2లో అంగద్ మెహ్రా పాత్రలో నటించాడు.