Mumbai: స్పా సెంటర్‭లో సెక్స్ రాకెట్.. రైడ్ చేసి 9 మంది బాలికల్ని కాపాడిన పోలీస్

వెర్సోవా పోలీసులు స్పా మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీ, యజమాని అతుల్ ధివర్‌లపై ఎఫ్‌ఐఆర్ నంబర్ 552/2023లో సెక్షన్ 370 (3), 34, ఇతర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న స్పా యజమాని అతుల్ ధివర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు

Mumbai: ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని స్పాపై దాడి చేసిన ముంబై పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచ్.. 9 మంది బాలికలకు విముక్తి కల్పించింది. సోషల్ సర్వీస్ బ్రాంచ్ అనేది ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్‌లో ఒక భాగం. వెర్సోవాలోని చార్ బంగ్లా ప్రాంతంలోని రివైవల్ వెల్ నెస్ స్పాలో మసాజ్ పార్లర్ పేరుతో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు శనివారం బృందానికి సమాచారం అందింది.

శనివారం రాత్రి బృందం సంఘటనా స్థలానికి వెళ్లి తనిఖీ చేసింది. ఈ క్రమంలో సెక్స్ రాకెట్‌లో చిక్కుకున్న 9 మంది బాలికలను రక్షించారు. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్, మిజోరాం నుంచి నిరుపేద బాలికలను స్పా సెంటర్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ముంబైకి తీసుకువచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు విచారణలో వెల్లడైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం వెర్సోవా పోలీసులు అంధేరి వెస్ట్ MHADA వంటి నివాస ప్రాంతాలపై కూడా విస్తృత దాడులు చేశారు. ఈ సమయంలో మణిపూర్ నుంచి నలుగురు బాలికలు, మిజోరాం నుంచి ఇద్దరు బాలికలు, మేఘాలయ నుంచి ఒక బాలిక, కోల్‌కతా నుంచి ఒక బాలిక, లక్నో నుంచి ఒక బాలికను రక్షించారు.

ఇది కూడా చదవండి: Mohamed Muizzu: అవసరం తీరాక మాట మార్చిన మాల్దీవ్ అధ్యక్షుడు.. భారత సైన్యాన్ని తరిమికొట్టాలంటూ ప్రచారం

స్థానిక వెర్సోవా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్పా మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో హాజరుపరచగా మూడు రోజుల పోలీసు కస్టడీ విధించారు. రిమాండ్ దరఖాస్తు ప్రకారం, స్పా యజమాని అతుల్ ధివర్ ఈ సెక్స్ రాకెట్‌కు కింగ్‌పిన్. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

వెర్సోవా పోలీసులు స్పా మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీ, యజమాని అతుల్ ధివర్‌లపై ఎఫ్‌ఐఆర్ నంబర్ 552/2023లో సెక్షన్ 370 (3), 34, ఇతర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న స్పా యజమాని అతుల్ ధివర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సోషల్ సర్వీస్ బ్రాంచ్ నిర్వహించిన దాడిలో, పరారీలో ఉన్న నిందితుడు అతుల్ ధివార్ సోదరుడు హర్షద్ ధివార్‌ను స్పా సెంటర్‌లో విచారించారు. అతుల్ ధివర్ సోదరుడి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అతుల్ ధివార్ లేకపోవడంతో అతని సోదరుడు హర్షద్ ధివార్ స్పా పనులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా బారిలో మరికొంత మంది బాలికలు ఉండవచ్చని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో భారీ అగ్రి ప్రమాదం.. ఎక్కడ జరిగింది? ఎంత మంది చనిపోయారో తెలుసుకోండి