MP Komatireddy Venkat Reddy : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆయనపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. చంపుతానని బెదిరించారని, అసభ్యకరంగా మాట్లాడారని చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

KOMATIREDDY (1)

MP Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆయనపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. చంపుతానని బెదిరించారని, అసభ్యకరంగా మాట్లాడారని చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోమటిరెడ్డిపై ఐపీసీ 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చెరుకు సుధాకర్ కుమారుడిని ఫోన్ లో బెదిరించినట్లు కోమటిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఐసీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు నిర్ధారించడం జరిగింది. ఇటీవల పీసీసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న చెరుకు సుధాకర్ తనయుడికి ఫోన్ చేసి తన అనుచరులు నీ తండ్రిని చంపుతారని.. నిన్ను కూడా చంపుతారని కోమటరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Komatireddy Venkat Reddy : బూతులు తిడుతూ వారం రోజుల్లో చంపేస్తారంటూ బెదిరింపులు.. మరో వివాదంలో కోమటిరెడ్డి

అదేవిధంగా నీ హాస్పిటల్ కూడా ఉండదని బెదించడం, అసభ్యకరంగా మాట్లడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుహాన్ నిన్న (సోమవారం) నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివిధ సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక ఆధారాలన్నీ సేకరించి, నిర్ధారించారు.

మరోవైపు బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం కాకుండా, నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసున నమోదు చేయాలని పార్టీలో ఉన్న బీసీ సంఘాల బీసీ నేతలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు, వివిధ ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.