Komatireddy Venkat Reddy : బూతులు తిడుతూ వారం రోజుల్లో చంపేస్తారంటూ బెదిరింపులు.. మరో వివాదంలో కోమటిరెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను విమర్శిస్తున్న చెరుకు సుధాకర్ ను హత్య చేసేందుకు తన అనుచరులు వంద వాహనాల్లో తిరుగుతున్నారంటూ ఫోన్ చేసి బెదిరించారు. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి.

Komatireddy Venkat Reddy : బూతులు తిడుతూ వారం రోజుల్లో చంపేస్తారంటూ బెదిరింపులు.. మరో వివాదంలో కోమటిరెడ్డి

Updated On : March 5, 2023 / 5:31 PM IST

Komatireddy Venkat Reddy : నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను విమర్శిస్తున్న చెరుకు సుధాకర్ ను హత్య చేసేందుకు తన అనుచరులు వంద వాహనాల్లో తిరుగుతున్నారంటూ ఫోన్ చేసి బెదిరించారు. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి.

తన స్థాయిని మరిచి బూతులతో విరుచుకుపడ్డారు. చెరుకు సుధాకర్ తనపై వ్యతిరేక ప్రకటనలు మానుకోకుంటే వారం రోజుల్లో తన అనుచరులు చంపేస్తారని, నిన్ను కూడా వదలరు అంటూ సుహాస్ ను బెదిరించారు కోమటిరెడ్డి. నీ ఆసుపత్రి కూడా ఉండదు, నువ్వు కూడా ఉండవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Telangana New Party : తెలంగాణలో మరో కొత్త పార్టీ..! మళ్లీ టీఆర్ఎస్? ఉగాది రోజున ప్రకటన?

కాల్ రికార్డింగ్ లో ఏముందంటే.. “స్టేట్‌మెంట్ విన్నావుగా.. వాన్ని చంపుతామని వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారు. ఈ ఒక్కసారి కాదు.. ఇప్పటికే వంద సార్లు నా గురించి మాట్లాడుతున్నాడు. నెల రోజుల నుంచి ఓపిక పట్టి.. ఇప్పుడు వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారు చంపెతందుకు. నీ హస్పిటల్ ఉండదు. నేను లక్షల మందిని బతికించిన. ఎంత ధైర్యం వానికి.. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి.. ఇప్పుడు నా మీదనే మాట్లాడుతుండు. ఇక వదిలిపెట్టరు నా మనుషులు వాన్ని. వార్నింగ్ ఇస్తున్నా.. వారం రోజుల్లో వాన్ని చంపేస్తారు. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు”.

ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై చెరుకు సుధాకర్ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.(Komatireddy Venkat Reddy)

Also Read..Komatireddy Rajagopal Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చెరుకు సుధాకర్ గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను హత్య చేసేందుకు తన అనుచరులు వంత వాహనాల్లో తిరుగుతున్నారు అంటూ కోమటిరెడ్డి చేసిన బెదిరింపులు కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈరోజు(మార్చి 5) ఉదయం 11గంటలకు చెరుకు సుధాకర్ కొడుకు చెరుకు సుహాస్ కు కోమటిరెడ్డి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం పర్యటనలో ఉన్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూ చెరుకు సుధాకర్ మాట్లాడటం జరిగింది. అదే సమయంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరికను కోమటిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.