Telangana New Party : తెలంగాణలో మరో కొత్త పార్టీ..! మళ్లీ టీఆర్ఎస్? ఉగాది రోజున ప్రకటన?

తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పురుడు పోసుకుంటోందా? ఉగాది రోజున టీఆర్ఎస్ ప్రకటన ఉంటుందా? ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలో ఉన్న తెలంగాణవాదులు టీఆర్ఎస్ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telangana New Party : తెలంగాణలో మరో కొత్త పార్టీ..! మళ్లీ టీఆర్ఎస్? ఉగాది రోజున ప్రకటన?

Telangana New Party : తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పురుడు పోసుకుంటోందా? ఉగాది రోజున టీఆర్ఎస్ ప్రకటన ఉంటుందా? ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలో ఉన్న తెలంగాణవాదులు టీఆర్ఎస్ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read..Uttam Kumar Reddy : ఆ దమ్ము కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది- బీజేపీ, బీఆర్ఎస్‌లపై ఉత్తమ్ ఫైర్

తెలంగాణ రాజ్యసమితితో పాటు పరిశీలనలో తెలంగాణ రైతు సమితి లేదా సమైక్య టీఆర్ఎస్ ఏర్పాటుకు బీఆర్ఎస్ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోని అసంతృప్త నేతలతో మంతనాలు జరుపుతున్నారని, టీజేఎస్ అధినేత కోదండరామ్ ని కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జోరందుకుంది.

Also Read..Komatireddy Rajagopal Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బీఆర్ఎస్ గా మారిపోయింది. దాంతో టీఆర్ఎస్ అనేది తెలంగాణలో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి బదులుగా టీఆర్ఎస్ అని అబ్రివేషన్ వచ్చేలా తెలంగాణ రైతు సమితి లేదా తెలంగాణ రైతు సమాఖ్య ఇలాంటి పేర్లతో ఒక కొత్త పార్టీ తీసుకొస్తే ఎలా ఉంటుంది? అని కొంతమంది తెలంగాణవాదులు, వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఇప్పటికే ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రర్ అయినట్లు సమాచారం అందుతోంది.

Also Read..Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తీసుకున్న అమిత్ షా

రాజ్యసమితి అనే పేరు కొంత ఇబ్బందికరంగా ఉంది, రాజ్యం అనే పదం అంత బాగాలేదన్న అభిప్రాయంలో కొత్తగా రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. అవి తెలంగాణ రైతు సమితి లేదా తెలంగాణ రైతు సమాఖ్య. ఈ రెండు పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. దీంతో పాటు కొత్తగా మరో పేరు వినిపిస్తోంది. అదే తెలంగాణ రక్షణ సమితి. ఎన్నికల సంఘంలో ఎక్కడా రిజిస్ట్రర్ కాకపోయినప్పటికీ.. ఒక ట్విట్టర్ ఫేస్ బుక్ హ్యాండిల్ లో ఒక పార్టీ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ తన గుర్తును రోడ్ రోలర్ గా చూపిస్తోంది. సత్యనారాయణ అనే వ్యక్తి పేరుతో ఇది కనిపిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.