Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తీసుకున్న అమిత్ షా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ నేతల మధ్య సమన్వయం కోసం అమిత్ షా కృషి చేస్తున్నారు.

Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తీసుకున్న అమిత్ షా

Narendra Modi, Amith Shah

Updated On : March 3, 2023 / 9:19 PM IST

Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ నేతల మధ్య సమన్వయం కోసం అమిత్ షా కృషి చేస్తున్నారు.

తెలంగాణలో బీజేపీలో చేరికల సమన్వయకర్త బాధ్యతలను బన్సల్ కు అప్పగించారు. మరోవైపు, ఎన్నికలకు సమయం మరికొన్ని నెలలే ఉండడంతో రథయాత్రలు చేపట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొనేందుకు 5 రథాలను సిద్ధం చేయిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఆ యాత్రలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ల వారీగా ఈ యాత్రలు చేపడతారు. రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేలా బీజేపీ ప్రణాళికలు వేసుకుంది. ఇటీవలే బీజేపీ తెలంగాణ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా చర్చించారు. ఏప్రిల్ నుంచి 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ర్యాలీలు జరపాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ముందస్తు ఎన్నికలు జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలని అనుకుంటోంది.

Uttam Kumar Reddy : ఆ దమ్ము కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది- పాదయాత్రలో ఉత్తమ్ ఫైర్