మిగ్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్

భారత నేవీకి చెందిన ఓ మిగ్-29కే ఫైటర్ జెట్ కూలిపోయింది. గోవాలోని దబోలిమ్ నుంచి ఇవాళ(నవంబర్-16,2019) శిక్షణా కార్యక్రమానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఫైటర్ జెట్ కూలిపోయింది.

అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు కెప్టెన్ ఎం. శోఖంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా బయటకు పడ్డారు. ఫైటర్ యొక్క ట్రైనర్ వెర్షన్ అయిన విమానం ఇంజిన్ మంటలకు గురైందని,ఈ కారణంగానే క్రాష్ అయిందని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ తెలిపారు.