పెళ్లైన మర్నాడే ప్రియుడితో లేచిపోయిన నవ వధువు

  • Publish Date - June 8, 2020 / 06:04 AM IST

అంగరంగం వైభవంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఆ జంట ఒక్కటయ్యారు. నవ వధువు ఆత్తవారింట కాలు పెట్టింది. కాపురానికి వచ్చి 24 గంటలు కూడా కాలేదు. కొత్త కోడలు ఆదృశ్యమయ్యింది. కంగారు పడిన అత్తింటి వారు అంతా వెతికారు. ఏమైందా అని ఆరాతీస్తే తన ప్రియుడితో లేచిపోయిందని తెలిసి షాక్ కు గురయ్యారు. 

తమిళనాడులోని సేలం జిల్లా చిన్నసముద్రానికి చెందిన పూమారై కూతురు సత్య(20) కు సెంగవల్లి నడువలూరు కు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్(28) తో జూన్ 4న వివాహం జరిగింది. రవికుమార్ వరికోత యంత్రం డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 4వతేదీ వివాహనంతరం సత్య అత్తావారింటికి వచ్చింది.

5వ తేదీ సాయంత్రం ఊళ్లోని షాపుకు వెళ్ళి వస్తానని వెళ్లిన సత్య ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భర్త రవికుమార్ ఇతర కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఆమె పుట్టింటి వారికి సమాచారం ఇచ్చారు. ఎంత వెతికినా ఆమె ఆచూకి లభించకపోయే సరికి రెండు కుటుంబాల వారు స్ధానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈలోగా రవికుమార్ భార్య నవ వధువు సత్య చిన్న సముద్రానికి చెందిన  వల్లరసు(23) అనే యువకుడిని పెళ్ళి చేసుకుని తమకు రక్షణ కల్పించాలని ఆత్తూర్ పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్నరవికుమార్ బంధువులు, సత్య తల్లి తండ్రులు ఆత్తూర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.

తాను వల్లరసు రెండేళ్లుగా  ప్రేమంచుకుంటున్నామని …తన ప్రేమను అంగీకరించని తల్లితండ్రులు రవికుమార్ తో  బలవంతంగా పెళ్లిచేసారని… దీంతో తానూ వల్లరసు మధురైలో వివాహం చేసుకున్నామని చెప్పింది. రవికుమార్ కుటుంబం తన పెళ్లి సమయంలో పెట్టిన బంగారు నగలు, రవికుమార్ కట్టిన తాళిపోలీసుల సమక్షంలో తిరిగి ఇచ్చేసింది.

కాగా పెళ్లికి ఐన ఖర్చును కూడా  తిరిగి ఇవ్వాలని రవికుమార్ కుటుంబ సభ్యులు కోరటంతో సత్య వల్లరసు అందుకు అంగీకరించి పోలీసుల ఎదుట అందుక సంబంధించిన అగ్రిమెంట్ మీద సంతకాలుచేసి ఇచ్చారు. 

Read: 25 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడి వివాహం…