Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పేలుడు కుట్రకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్‌లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

Darbhanga Blast Case : ఉత్తరప్రదేశ్‌లోని  దర్భంగా  రైల్వే  స్టేషన్‌లో పేలుడు కుట్రకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్‌లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మాలిక్ బ్రదర్స్ ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌కు  చెందిన హాజీ సలీం, కాఫీల్ లను అరెస్ట్ చేసారు.

ఈ పేలుడు కుట్రలో హాజీసలీం అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. నిందితులు నలుగురు ఈ ఏడాది ఫిబ్రవరిలో హజీసలీం ఇంట్లో సమావేశమై  రైలు ప్రయాణిస్తున్నప్పుడే   ఐఈడీ  పేల్చాలని భారీ కుట్రకు రచన చేశారు.

లష్కరే తోయిబా ముఖ్యనేత  ఇక్బాల్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండే హజీసలీం, ఇక్బాల్ ఆదేశాలను హైదరాబాద్ లో ఉంటున్న మాలిక్ సోదరులకు చేరవేసేవాడు. దర్భంగా బ్లాస్ట్‌కు హజీసలీం నిథులు సమకూర్చాడు. మాలిక్ బ్రధర్స్, ఇక్బాల్‌ఖాన్‌కు హజీసలీం మధ్య వర్తిత్వం వహించినట్లు అధికారులు తెలిపారు.

కాగా… గత నెల 30న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ లను ఈ రోజు పాట్నా కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. నిందితులను 10 రోజుల కస్టడీ కోరగా, 9 రోజుల పాటు కస్టడీకి పాట్నా కోర్టు అనుమతి ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు