Dummugudem Maoists Case : దుమ్ముగూడెం కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఎ

దుమ్ముగూడెం  మావోయిస్టుల  కేసులో ఎన్ఐఎ అధికారులు ఈరోజు ఛార్జ్‌షీట్ దాఖలు చేసారు. 7 గురు మావోయిస్ట్ నేతల పేర్లను ఎన్ఐఎ అధికారులు ఛార్జ్ షీట్ లో చేర్చారు.

Dummugudem Maoists Case :  దుమ్ముగూడెం  మావోయిస్టుల  కేసులో ఎన్ఐఎ అధికారులు ఈరోజు ఛార్జ్‌షీట్ దాఖలు చేసారు. 7 గురు మావోయిస్ట్ నేతల పేర్లను ఎన్ఐఎ అధికారులు ఛార్జ్ షీట్ లో చేర్చారు. వారిలో ముత్తు నాగరాజు, కొమ్మరజు కనక్కయ్య, సారయ్య, హిడ్మా, సాంబయ్య, మడకం కోసి,వల్లేపు స్వామి పేర్లు ఉన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా మే 2న ఎన్ఐఎ కేసు నమోదు చేసింది. ఈకేసు ప్రకారం ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు మవోయిస్టులు కుట్రపన్నారని ఆరోపించారు. ఈ ప్లాన్ విజయవంతంగా అమలు చేసేందుకు మావోయిస్టు నాయకుడు హిడ్మ భారీగా నిధులు సేకరించాడు.

దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసు (Case of Explosive) కు సంబంధించి తెలంగాణలోని  5 జిల్లాల్లో ఎన్​ఐఏ సోదాలు (NIA Raids) నిర్వహించింది.  ఈ   సోదాల్లో 500 కేజీల బూస్టర్‌ల‌తో పాటు 400 జిలెటిన్ స్టిక్స్, భారీగా డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారుల పేరుతో నిందితులు వాహనాల్లో పేలుడు సామాగ్రి తరలించి  తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులో హిడ్మాకు, ఇతర అగ్రనేతలకు ఆయుధాలు పేలుడు పదార్ధాలు అందచేసేందుకు యత్నించారు.

ఎన్ఐఎల  సోదాల్లో  ఐఈడీ, గ్రనేడ్​ లాంఛర్ల తయారీకి అవసరమైన సామగ్రి గుర్తించారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు  అప్పట్లో  ఎన్​ఐఏ పేర్కొంది. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టు నేత హిడ్మా కు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎన్​ఐఏ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు