Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది సజీవ దహనం

మహారాష్ట్రంలో నిన్నరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు.

Mahatashtra Road Accident

Maharashtra : మహారాష్ట్రంలో నిన్నరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. గురువారం రాత్రి గం.10-30 సమయంలో చంద్రాపూర్-ముల్ రోడ్డుపై   అజయ్‌పూర్ సమీపంలో ఒక డీజిల్ ట్యాంకర్, కలప లోడుతో వెళుతున్న లారీ ని ఢీ కొట్టింది.

ఈఘటనలో ఒక్కసారిగా  మంటలు చెలరేగటంతో  రెండు లారీలు అగ్నికి ఆహుతయ్యాయి. లారీలోని కలప కాలి బుూడిదయ్యింది.  తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో లారీ డ్రైవర్ తో పాటు కూలీలు కూడా ఉన్నారని  పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన గంట సేపటికి అగ్నిమాపక శకటాలు ఘటనా స్ధలానికి చేరుకుని కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు  వచ్చాయి. మృతదేహాలను చంద్రాపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చంద్రాపూర్‌ సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుధీర్‌ నందన్‌వార్‌ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.