నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఇక ఈ కామాంధులకు ఉరి తీయడమే తరువాయి. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో వీరికి మరణశిక్ష అమలు చేయాలంటూ డెత్ వారెంట్ ఇప్పటికే జారీ చేసింది. కానీ ఉరి శిక్ష వేయాలంటే..ఎన్నో ప్రాసెస్ ఉంటాయి. వీటన్నింటినీ పూర్తి చేశాకే…అమలు చేస్తుంటారు. ఇందుకు కసరత్తును ప్రారంభించారు అధికారులు.
జైలు సిబ్బంది ట్రయల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తీహార్ జైలు అధికారులు. దోషులు ఎంత వెయిట్ ఉంటారు ? అంతే బరువు కలిగిన వస్తువులను ఉపయోగించి..ఉరి ట్రయల్ వేయనున్నారు. ఉరి శిక్ష ట్రయల్స్ మూడో నెంబర్ కారాగారంలో నిర్వహించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే..ట్రయల్స్ మాత్రం ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించలేదు.
ట్రయల్స్ ఎవరు పాల్గొంటారంటే..జైలు సూపరింటెండెంట్, వర్క్ డిపార్ట్ మెంట్ అధికారులు, ఇతర అధికారులు ఉంటారు. ఉరికి ఉపయోగించే తాళ్లను బక్సర్ నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. 2013లో పార్లమెంట్ దాడి ఘటనలో దోషి అప్ఝల్ గురును జైలు నెంబర్ 3లోనే ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిర్భయ దోషులకు కూడా ఇక్కడే ఉరి తీయనున్నారు. దేశంలో నలుగురిని ఒకేసారి ఉరి తీయడం మొదటిసారి.
Read More : ఆస్ట్రేలియాలో కార్చిచ్చు : బాధితులను ఆదుకోవడంపై ఫోకస్