Siddipet 42 Lakhs Loot Case : 48 గంటలు గడిచినా దొరకని రూ.42 లక్షల చోరీ కేసు నిందితులు

సిధ్దిపేట రిజిష్ట్రేషన్ ఆఫీసు వద్ద రూ.42,50,000 చోరీ జరిగి 48 గంటలు గడిచినా నిందితుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఘటన జరిగిన కొద్దిసేపటికే సిద్దిపేట పోలీసు కమీషనర్ శ్వేత 24 గంటల్లో

Siddipet 42 Lakhs Looti Case :  సిధ్దిపేట రిజిష్ట్రేషన్ ఆఫీసు వద్ద రూ.42,50,000 చోరీ జరిగి 48 గంటలు గడిచినా   నిందితుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఘటన జరిగిన కొద్దిసేపటికే   సిద్దిపేట పోలీసు కమీషనర్ శ్వేత 24 గంటల్లో కేసును చేధిస్తామని  ప్రకటించారు. సీపీ చెప్పినట్లు 48 గంటలు గడిచినప్పటికీ  ఈ కేసులో ఎటువంటి పురోగతి కన్పించలేదని  తెలుస్తోంది.

సీసీకెమెరాల్లో నిక్షిప్తమైన నిందితులను పట్టుకోవటంలో పోలీసులు విఫలమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  చోరీ ఘటనతో జిల్లా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. జిల్లా ఎస్పీకి ఈకేసు సవాలుగానే మారింది.

ఈ చోరీ కేసుకు సంబంధించి ఇప్పటికే   ప్లాటు విక్రయదారు నర్సయ్య, కొనుగోలుదారు శ్రీధర్ రెడ్డి, డాక్యుమెంట్  రైటర్ తో పాటు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు పిలిపించి విచారణ చేశారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు 15 పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు.

దుండగులు నర్సయ్య కారు డ్రైవర్‌ను ఎలా వెంబడించారు, ఎలా కాల్చారన్న సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలు స్ధానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పినట్లుగానే విచారణను ముమ్మరం చేశారు. దుండగులకు గన్ ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎవరెవరితో మాట్లాడారు, సంఘటన స్థలంలో వారి మూవ్‌మెంట్,ఎవరెవరితో మాట్లాడారు.. అనే కోణంలో విచారిస్తున్నారు.

ఆగంతకులు వాడిన పల్సర్ బైక్ ముందు వెనక నెంబర్ ప్లేట్ లేకపోవడం, వారు సీసీ కెమెరాల్లో క్లియర్‌గా రికార్డు కాకపోవడం కూడా నిందితులను గుర్తించేందుకు ఆలస్యం జరగటానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో కరెంటు పోవడంతో పూర్తి స్థాయి విజువల్స్ లేకుండా పోయాయి. కరెంటు పోకుండా ఉన్నట్లయితే ఆగంతుకుల విజువల్స్ సీసీ కెమెరా లో పూర్తి స్థాయిలో నిక్షిప్తమై ఉండేవి.
Also Read : Bandi sanjay : తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పాలాభిషేకం
ఆగంతకులు అక్కడ రెక్కీ నిర్వహిస్తున్న క్రమంలో అతి సమీపంలో ఒక ద్విచక్ర వాహనదారుడు, ఒక కారు కాసేపు ఆగినట్టుగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. అలాగే నర్సయ్య, శ్రీధర్ రెడ్డిల మధ్య క్రయవిక్రయానికి సంబంధించి డబ్బులు చేతులు మారే విషయాన్ని దుండగులకు చేరవేసింది ఎవరు…ఈ మొత్తం చర్య వెనక అసలు కారకులు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో పురోగతిని వెల్లడించే అవకాశాలు లేకపోలేదు.

ట్రెండింగ్ వార్తలు