KGF హీరో యశ్ హత్యకు కుట్ర చేసిన నేరస్తుడు ఎన్‌కౌంటర్‌

కేజీఎఫ్(KGF) సినిమా హీరో యశ్ హత్యకు కుట్రపన్నిన నేరస్తుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. స్లమ్ భరత్(slum bharath) ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. తీవ్రమైన నేరచరిత్ర ఉన్న

  • Publish Date - February 29, 2020 / 12:54 AM IST

కేజీఎఫ్(KGF) సినిమా హీరో యశ్ హత్యకు కుట్రపన్నిన నేరస్తుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. స్లమ్ భరత్(slum bharath) ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. తీవ్రమైన నేరచరిత్ర ఉన్న

కేజీఎఫ్(KGF) సినిమా హీరో యశ్ హత్యకు కుట్రపన్నిన నేరస్తుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. స్లమ్ భరత్(slum bharath) ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. తీవ్రమైన నేరచరిత్ర ఉన్న స్లమ్ భరత్‌ను(32) కర్ణాటక పోలీసులు మట్టుపెట్టారు. అనేక నేరారోపణలతో పరారీలో ఉన్న స్లమ్ భరత్‌ను రెండురోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్ లో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగళూరు తీసుకొచ్చారు. ఓ కేసులో భాగంగా క్రైమ్ సీన్‌‌లో రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పారిపోయేందుకు యత్నించిన భరత్.. తమపై దాడికి యత్నించాడని, దీంతో ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు తెలిపారు. 

ఎన్ కౌంటర్ లో స్లమ్ భరత్ హతం:
స్లమ్ భరత్ తమపై కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. ఒక బుల్లెట్ ఎస్ఐకి తగిలిందని, మరో బుల్లెట్ వెహికల్‌కు తాకిందని వివరించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండటంతో ఎస్ఐకి ఎలాంటి హానీ జరగలేదన్నారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో భరత్ పొత్తి కడుపులోకి, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని సప్తగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే స్లమ్ భరత్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. గురువారం (ఫిబ్రవరి 27,2020) తెల్లవారుజామున హీసరఘట్టలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. 

యశ్‌ హత్యకు కుట్ర: 
కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయిన హీరో యశ్. అలాంటి స్టార్ హీరోను చంపడానికి కర్ణాటకలో కుట్ర జరిగింది. యశ్..హత్యకు ప్లాన్ చేసిన వారిలో స్లమ్ భరత్ ప్రధాన నిందితుడు. 2019 మార్చి 7న.. స్లమ్​ భరత్ అతని అనుచరులు యశ్​ హత్యకు కుట్ర పన్నారు. అయితే వారి ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారందరిని అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. ఆ తర్వాత భరత్ బెయిల్‌పై విడుదలయ్యాడు. స్లమ్ భరత్ కరుడుగట్టిన క్రిమినల్. హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్న మోస్ట్ డేంజరస్ నేరస్తుడని పోలీసులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు