ACB Raids : విజిలెన్స్ అధికారులకు చిక్కిన రెవెన్యూ ఆఫీసర్

ఒడిషా లోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ ప్రాంత దుదారి రెవెన్యూ ఆఫీసర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

ACB Raids :  ఒడిషా లోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ ప్రాంత   దుదారి రెవెన్యూ ఇన్స్‌పెక్టర్  రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు జయపురం రెవెన్యూ అధికారిణి ఖిరాది తన్నయ్య, జయరాం పంగి అనే వ్యక్తి వద్దనంచి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారు.

Also Read : Dead Bodies In Flood Water : వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు

దీంతో బాధితుడు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. జయరాం,   తన్నయ్యకు 10 వేలు రూపాయలు లంచం ఇస్తుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. తన్నయ్యను అదుపులోకి తీసుకుని జయపురం విజిలెన్స్ కార్యాలయానికి తరలించి విచారణ జరిపారు.

ట్రెండింగ్ వార్తలు