×
Ad

Burglar Arrested : అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు.

  • Published On : December 3, 2021 / 05:25 PM IST

Hyderabad CP Anjani Kumar

Burglar Arrested :  అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. చోరీకి గురైన 12 లక్షల రూపాయల నగదుతో పాటు, 65 లక్షల రూపాయల విలువైన 1.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

జోగిని రంగమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఇంట్లో, అల్లుడు   వరసయ్యే లక్ష్మణ్   చోరీ చేసినట్టు ఫిర్యాదు చేసింది.  సాంకేతిక  ఆధారాల ద్వారా పోలీసులు ఈ కేసు చేధించారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. జోగిని రంగమ్మకి, లక్ష్మణ్ బంధువు అల్లుడు అవుతాడని… నిందితుడికి, బాధితురాలు వరుసకి అత్త అవుతుందని ఆయన వివరించారు.

Also Read : AP Covid Update : ఏపీలో కొత్తగా 138 కోవిడ్ కేసులు

నవంబర్ చివరి వారంలో రంగమ్మ కాశీకి తీర్థయాత్రకు వెళ్లింది. కాశీ  నుంచి తిరిగి వచ్చి చూసుకుంటే ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించింది.  దీంతో బాధితురాలు యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  నిందితుడు లక్ష్మణ్ తన అత్త ఇంట్లో డ్రిల్లింగ్ చేసి దొంగతనం చేశాడని పోలీసులు వివరించారు.