కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లిన ఉద్యోగి సంస్ధ డబ్బు వాడుకున్నాడని అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది యాజమాన్యం. కంపెనీ సొమ్ము వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. రెండు రోజులపాటు బంధించి, శారీరకంగా హింసించి వదిలేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సదరు ఉద్యోగి అలాగే చేసి క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆఫీసుకు వెళ్ళగా..యజమాని రెచ్చిపోయి అతనిపై చిందులేశాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు, తిరిగి వచ్చి పూణే లో క్వారంటైన్ లో ఉన్నప్పుడు ఖర్చు చేసిన కంపెనీ డబ్బులు తిరిగి చెల్లించాలని పట్టుబట్టాడు. కంపెనీ పనిమీద వెళ్లి ఖర్చు పెట్టిన డబ్బులు నేనెలా చెల్లిస్తానని ఉద్యోగి ప్రశ్నించాడు. దీంతో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి జూన్ 13న ఆ ఉద్యోగిని కిడ్నాప్ చేసాడు యజమాని. రెండు రోజుల పాటు నిర్భంధించి ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పూసి నరకం చూపించాడు. విడుదలైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Here>>కొన్ని గంటల్లో పెళ్లి.. బ్యూటీ పార్లర్‌లో వధువు హత్య..! మాజీ ప్రియుడే చంపేశాడా?