పంజరంలో చిలుకలు ఎగిరిపోయాయని 8 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపేశారు

  • Publish Date - June 4, 2020 / 06:00 AM IST

పంజరంలో ఉండే చిలుకలు ఎగిరిపోయాయని ఓ చిన్నారిని కొట్టి కొట్టి చంపేశాడు చిలుకలు అమ్మే యజమాని. పాకిస్థాన్ లోని రావల్పిండిలో ఈ దారుణం జరిగింది. చిన్నారితో పనిచేయించుకోవటమేకాకుండా..పొరపాటున జరిగిన పనికి ఆ యజమాని తన భార్యతో చిన్న పిల్ల అని కూడా చూడకుండా క్రూరాతి క్రూరంగా కొట్టి చంపేశారు.  

వివరాల్లోకి వెళితే..రావల్పిండిలో ఓ వ్యక్తి ఇంట్రో జోహ్రా అనే ఎనిమిది సంవత్సరాల చిన్నారి నాలుగు నెలలుగా పనిచేస్తోంది. ఆ ఇంటివారు చిలుకలను పెంచుకంటుంటారు. ప్రతీరోజూ చిలుకలకు ఆహారం వేయటం..పంజరం శుభ్రం చేయటంతో పాటు ఆ యజమాని కున్న చిన్నపాపను చూసుకోవటానికి జాహ్రాను పనిలో పెట్టుకున్నారు. 

ఈ క్రమంలో ఆదివారం (మే 31,2020)న జోహ్రా ఉదయమే పనిలోకి వచ్చింది చిన్నారి జోహ్రా.  వచ్చిన తరువాత పంజరం శుభ్రం చేసి చిలుకలకు మేత వేయటానికి పంజరాన్ని తెరిచింది. అంతే ఆ పంజరంలో ఉండే చిలుకలు ఎగిరిపోయాయి. దీంతో యజమానికి కోపం తారాస్థాయికి చేరుకంది. ఆ చిలుకలు చాలా ఖరీదైనవి..నీ నిర్లక్ష్యంతోనే అవి ఎగిరిపోయాయని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. కనీసం పసిపిల్ల అని కూడా కనికరించలేదు. ఆ తరువాత షాపు యజమాని భార్య కూడా కొట్టింది. ఆ దెబ్బలు తాళలేని ఆ చిన్నారి కొట్టొందంటూ ఇద్దరినీ బతిమాలుకుంది. అయినా వినకుండా ఇష్టమొచ్చినట్లుగా కొట్టటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. దెబ్బలు తాళలేక జాహ్రా స్పృహ తప్పి పడిపోయింది.

దీంతో జాహ్రాను రావల్పిండిలో సిటీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ చేశారు.పాపం ఒంటిపై గాయాలు చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. జోహ్రా లేత శరీరం నిండా గాయాలే. ముఖం, చేతులు, పక్కటెముకలు..కాళ్ళు..తొడలు, ఇలా శరీరమంతా గాయాలు కావటంతో పరిస్థితి అప్పటికే విషమించింది. వెంటనే జోహ్రాను డాక్టర్లు సీయూకి తరలించి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. సోమవారం జోహ్రా చనిపోయింది. 

ఈ విషయం తెలిసి సదరు యజమాని పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని..జోహ్రా మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. అనతరం యజమానితో సహా అతని భార్యపై  కేసు నమోదు చేసారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా జోహ్రా తొడలపై తీవ్రగాయాలు ఉండటంతో జోహ్రాను లైంగికంగా కూడా వేధించినట్లుగా అనుమానిస్తున్నారు.పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి విరాలుతెలియాల్సి ఉంది. 

కాగా పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా బాల కార్మికులు సంఖ్య అత్యంత భారీగా ఉంది. దీనిపై మానవ హక్కుల కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (హెచ్‌ఆర్‌సిపి) 2018 నివేదిక ప్రకారం..దేశంలో సుమారు 12 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారని అంచనా వేసింది.

Read: హాంకాంగ్ చైనాకు చెందినదే: నేపాల్