Woman MLA Obscence Video : వైరలవుతున్నమహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో

సాంకేతిక పెరిగి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావటంతో ప్రపంచం అరచేతిలో ఇమిడి పోయినట్టైంది. లెక్కకు మిక్కిలి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు స్మార్ట్ ఫోన్లలో ఉండటంతో సైబర్ నేరాలు కూడా పెరు

Woman MLA Obscence Video :  వైరలవుతున్నమహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో

Pakistan Mla Sania

Updated On : November 20, 2021 / 10:59 AM IST

Woman MLA Obscence Video :  సాంకేతిక పెరిగి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావటంతో ప్రపంచం అరచేతిలో ఇమిడి పోయినట్టైంది. లెక్కకు మిక్కిలి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు స్మార్ట్ ఫోన్లలో ఉండటంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది వీటి బారిన పడుతున్నారు. తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యేకు చెందిన అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాకపోతే ఇది ఇండియాలో కాదు పాకిస్తాన్ లో జరిగింది.

పాకిస్తాన్ పంజాబ్ లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే… పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యేకు చెందిన అశ్లీల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఆమె దృష్టికి రావటంతో దీని గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సానియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. సానియా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియంకు స్నేహితురాలు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆమె పలు అంశాలపై పని చేస్తున్నారు.

Also Read : Heavy Flood Water : కడప జిల్లాలో వరద బీభత్సం

ఈ వీడియో వైరల్ అవటం గురించి అక్టోబర్‌లో తెలుసుకున్న ఎమ్మెల్యే …. దీని గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిందని పాక్‌ మీడియా తెలిపింది. అక్టోబర్‌ 26న సానియా ఫెడరల్‌ దర్యాప్తు సంస్థకు ఈ అశ్లీల వీడియో గురించి ఫిర్యాదు చేసారు. సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ఓ అశ్లీల వీడియోలో తాను కనిపిస్తున్నానని… ఎవరో కావాలనే తనన అప్రతిష్టపాలు చేసేందుకు వీడియోలో తనని మార్ఫ్‌ చేశారని తన ఫిర్యాదులో పేర్కోన్నారు.

కాగా…. వీడియో చూసిన సోషల్‌ మీడియా యూజర్లు మాత్రం అందులో ఉన్నది ఎమ్మెల్యే సానియానే అని చెబుతున్నారు. ఈ వార్తలని ఎమ్మెల్యే సానియా ఖండించారు. సానియా ఫిర్యాదు అందుకున్న మూడు వారాల తర్వాత పోలీసులు ఇందుకు బాధ్యుడైన ఓవ్యక్తిని అరెస్ట్‌ చేశారు. కానీ అతడి వివరాలు బయట పెట్టలేదు. అంతేకాక వీడియోలో నటించిన స్త్రీ సానియానా లేక వేరే మహిళా అనే విషయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాకిస్తాన్ కు చెందిన పలు మీడియా కథనాల ప్రకారం వీడియో వైరల్ అవుతున్నప్పటి నుంచి సానియాకు అసభ్య ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని తెలిసింది.