ప్రముఖ బిగ్ మనీ మేనేజర్ పేటీఎం వ్యాలెట్ నుంచి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా రూ.5వేలుకు పైగా మొబైల్ వ్యాలెట్ నుంచి దొంగిలించారు. ఒక్కసారిగా తన వ్యాలెట్ నుంచి నగదు విత్ డ్రా కావడంతో ఎమ్కే ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్స్ ఆఫ్ సీఈఓ ఎం. సచ్‌దేవా షాక్ అయ్యారు.
తన మొబైల్ వ్యాలెట్ నుంచి ఆటోమాటిక్ గా ఓ జ్యూస్ అమ్మే వ్యక్తికి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈ రోజు ఉదయం (మంగళవారం) తన పేటీఎం వ్యాలెట్ నుంచి శ్రీ బాలాజీ అనే జ్యూస్ సెంటర్ వ్యక్తికి రూ.5,520.93 ట్రాన్స్ ఫర్ అయినట్టు పేటీఎం కేర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.
తాను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ మోసపూరిత లావాదేవీ జరిగినట్టు గుర్తించినట్టు చెప్పారు. నా పేటీఎం వ్యాలెట్లో ఉన్న మొత్తం రూ.5వేలను ఒకేసారి బాలాజీ జ్యూస్ సెంటర్ పేటీఎం అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. వెంటనే.. పేటీఎం కేర్ కు ఫిర్యాదు చేశాను. ఎంతో భద్రతపరైమన పేటీఎం వ్యాలెట్ నుంచి సైబర్ మోసం ఎలా జరిగింది అనేదానిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు ట్వీట్ చేశారు. సచ్ దేవాకు ట్విట్టర్ అకౌంట్లో 4,946 ఫాలోవర్లు ఉన్నారు.
సచ్ దేవా అభ్యర్థనపై పేటీఎం బ్యాంకు కేర్ స్పందించింది. ఆయన వ్యాలెట్ నుంచి జరిగిన అక్రమ లావాదేవీని పరిశీలించింది. అనంతరం ఐదు వేల మొత్తాన్ని తిరిగి తన వ్యాలెట్లో రిఫండ్ చేసింది. ‘హాయ్ వికాస్.. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నాం. బాలాజీ జ్యూస్ సెంటర్‌కు వ్యాలెట్ ట్రాన్సాక్షన్ కింద జరిగిన లావాదేవీని తిరిగి మీ అకౌంటుకు రూ.5,220.93 మొత్తాన్ని జమ చేస్తున్నాం’ అని తెలిపింది. ఆ తర్వాత వికాస్.. తన పేటీఎం వ్యాలెట్ హిస్టరీ చేసుకోగా.. మొత్తం నగదు తిరిగి జమ అయినట్టు చెప్పారు.