Vaishali Kidnapping Case : వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్

వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు అయింది. BDS విద్యార్థిని వైశాలి ఇంటిపై దాడి చేసి ఆమెను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిపై అదిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు అయ్యాయి.

Vaishali kidnapping case

Vaishali kidnapping case : వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు అయింది. నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ చౌహాన్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. BDS విద్యార్థిని వైశాలి ఇంటిపై దాడి చేసి ఆమెను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిపై అదిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఘటనలో నవీన్ రెడ్డితో పాటు 40 మందిపై కేసులు నమోదయ్యాయి.

BDS విద్యార్థిని వైశాలి ఫోటోలు మార్ఫింగ్ చేసి నకిలీ అకౌంట్స్ ద్వారా నవీన్ రెడ్డి షేర్ చేశారు.  నవీన్ తోపాటు 40 మందిపై పోలీసులు గతంలోనే కేసు నమోదు చేసి వారందరినీ జైలుకు కూడా తరలించారు. వైశాలి ఇంటిపై అమానుషంగా దాడి చేసి, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆమెపై క్రూరంగా దాడి చేసి కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

Vaishali Kidnap Remand Report : పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్.. వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

నవీన్ రెడ్డిపై ఉన్న కేసుల ఆధారంగా పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ప్రకటించారు.  ప్రస్తుతం నవీన్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఇటీవల రంగారెడ్డి కోర్టులో రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు అతని బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. అనంతరం నవీన్ రెడ్డి హైకోర్టును సైతం ఆశ్రయించారు.