Photographer Suicide Due To Illicet Affair
Photographer ends his life due to extra marital affair : ఒక మహిళతో పరిచయం యువకుడి నిండు ప్రాణాలు బలిగొంది. మహిళ వేథింపుల కారణంగా ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా గొదావరిఖని, కేకే నగర్ కు చెందిన కొయ్యాడ రమేష్ ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు.
ఏడాది క్రితం ఓ వివాహా వేడుకలో పెద్దపల్లికి చెందిన చింతల రమాదేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవటం.. వాట్సప్ లో చాటింగ్ చేసుకోవటం మొదలెట్టారు.
ఈపరిచయాన్ని ఆసరాగా చేసుకుని రమాదేవి రమేష్ నుంచి రెండుతులాల బంగారం, రూ.6లక్షల నగదు తీసుకుంది. కొన్నాళ్ల క్రితం రమేష్ బంగారం, నగదు తిరిగి ఇవ్వమని అడిగాడు. దీంతో రమాదేవి రమేష్ ను బెదిరించింది.
ఫోన్ కాల్స్, వాట్సప్ చాటింగ్ లు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయసాగింది. మార్చి 28న రమేష్ పై పెద్దపల్లి పోలీసుస్టేషన్ లో కేసు పెట్టింది. తాను నివాసం ఉండే చోట పరవు పోయిందని, వేరే ప్రాంతంలో ఇల్లు అద్దెకు చూస్తానని భార్యకు చెప్పి మార్చి 30న రమేష్ బయటకు వెళ్లాడు.
సాయంత్రం వరకు భర్త ఇంటికి తిరిగి రాకపోయే సరికి భార్య లావణ్య అతనికి ఫోన్ చేసింది. రమాదేవి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విఛ్ఛాఫ్ చేశాడు. వెంటనే లావణ్య తన భర్త కనిపించటం లేదని గోదావరిఖని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ కోసం గాలింపు చేపట్టారు. రెండు రోజుల తర్వాత శుక్రవారం..సుల్తానాబాద్ మండలం నీరుకువ్వ గ్రామ సమీపంలోని మానేరువాగు వద్ద రమేష్ మృతదేహం లభ్యమయ్యింది. లావణ్య ఫిర్యాదుతో రమాదేవిపై కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు.