Sanga Reddy Constable Incident: సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రివాల్వర్ తో ఛాతి భాగంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ కి చెందిన సందీప్ ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సందీప్ ఆత్మహత్య ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. సందీప్ ఆత్మహత్యకు ఆన్ లైన్ బెట్టింగ్ లే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఘటనా స్థలం వద్దకు మీడియాని పోలీసులు అనుమతించలేదు. దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సందీప్ దగ్గర గన్ ఎలా వచ్చింది అన్నదానిపై మిస్టరీ నెలకొంది.
Also Read: చేవెళ్ల బస్సు ప్రమాదం.. టిప్పర్ ఢీకొట్టినదానికంటే కూడా దీని వల్ల ఎక్కువమంది చనిపోయారు.. పాపం..