Kerala Incident: అయ్యయో.. టీ ఎంత పని చేసింది? 75లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి.. కళ్ల ముందే..

వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Kerala Incident: అయ్యయో.. టీ ఎంత పని చేసింది? 75లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి.. కళ్ల ముందే..

Updated On : October 25, 2025 / 5:10 PM IST

Kerala Incident: కేరళలో షాకింగ్ ఘటన జరిగింది. టీ తాగాలనే కోరిక ఆ వ్యాపారి కొంప ముంచింది. ఏకంగా 75లక్షల నష్టం మిగిల్చింది. అసలేం జరిగిందంటే.. కేరళ ఎడప్పల్ కి చెందిన వ్యాపారి బుబారక్ (53) బెంగళూరుకి వెళ్లాడు. తిరిగి కేరళకి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అతడికి టీ తాగాలని అనిపించింది. దాంతో మన్నతి బైపాస్ దగ్గర కిందకు దిగాడు. అతడి దగ్గర 75లక్షల రూపాయల నగదు ఉంది. డబ్బను అతడు ఓ బ్యాగ్ లో ఉంచాడు.

వ్యాపారి.. మెడికల్ షాప్ ఎదురుగా తన డబ్బుల బ్యాగ్ ఉంచాడు. టీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. అతడు మామూలుగా నడుచుకుంటూ వచ్చాడు. సడెన్ గా అక్కడ ఉంచిన డబ్బుల సంచిని ఎత్తుకెళ్లిపోయాడు. కళ్ల ముందే ఆ వ్యక్తి రావడం, తన డబ్బుల బ్యాగ్ ని తీసుకెళ్లడం అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి. దీంతో వ్యాపారి బుబారక్ షాక్ అయ్యాడు. అతడి నోట మాట పడిపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు.

వ్యాపారి తేరుకునే లోపే ఆ వ్యక్తి డబ్బు సంచితో పారిపోయాడు. దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. వ్యాపారిని తోసేసి దొంగ పారిపోయాడు. అక్కడే రెడీగా ఉన్న ఇన్నోవాలో ఎక్కి దొంగ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. దొంగను పట్టుకునే క్రమంలో అతడు తోసేయడంతో కింద పడ్డ వ్యాపారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చోరీ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Also Read: దారుణం.. 5 నెలల్లో నాలుగుసార్లు అత్యాచారం.. మహిళా డాక్టర్ ఆత్మహత్య.. చేతిపై సూసైడ్ నోట్