తీరు మారడం లేదు : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. 15 వాహనాలు సీజ్

మద్యం మత్తులో యువతులు హల్‌చల్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించిన పోలీసులకు చుక్కలు చూపించారు.

  • Publish Date - February 24, 2019 / 03:27 AM IST

మద్యం మత్తులో యువతులు హల్‌చల్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించిన పోలీసులకు చుక్కలు చూపించారు.

హైదరాబాద్ : నగరంలో తరుచుగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తున్నా… మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం తాగి వాహనాలను నడపడం పరిపాటిగా మారిపోయింది. ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా, వాహనాలను సీజ్ చేస్తున్నా గానీ పట్టుబడుతున్నారు. వారిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. తాజాగా హైదరాబాద్ లో పలువురు మద్యం తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
మద్యం మత్తులో యువతులు హల్‌చల్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించిన పోలీసులకు చుక్కలు చూపించారు. వీకెండ్‌లో ఫుల్‌గా మందు కొట్టి కారు స్టీరింగ్ పట్టిన బామలు…పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో పలు వాహనాలను ఢీ కొన్నారు. ఈ తనిఖీల్లో పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే 9 కార్లు, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.