Police Filed Case On Tdp Ex Mla Dhulipalla Narendra Due To Violation Of Covid Rules
TDP Leader Dhulipalla Narendra : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌లో ఈరోజు కేసు నమోదయ్యింది. కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించి 20 మందితో హోటల్‌లో మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. నరేంద్రపై ఐపీసీ సెక్షన్ 188, 269, రెడ్ విత్ 34 (3) eda కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సంగం డైరీకి సంబంధించి విజయవాడలోని ఒక హోటల్ లో, నరేంద్ర 20 మందితో మీటింగ్ పెట్టి, వారితో భోజనం చేసినట్లు తెలుసుకున్న పోలీసు, ఎస్సైకి ఫిర్యాదు చేయటంతో పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 12 మందితోనే సమావేశం పెట్టుకున్నట్లు సంగం యాజమాన్యం చెపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంగం డైరీ లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఏప్రిల్ 24 తెల్లవారు ఝూమున ఏసీబీ అధికారులు గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన్ను అరెస్ట్ చేశారు. టీడీపీలో క్రియాశీలక నేతగా ఉన్న నరేంద్ర టీడీపీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 2019 గా పొన్నూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవుతూ వచ్చారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో కిలారి వెంకటరోశయ్య చేతిలో ఓడిపోయారు. నరేంద్ర 2010 నుంచి సంగం డైరీకి ఛైర్మన్ గా ఉంటున్నారు.