Hyderabad Drugs : పోలీసులపైకి 100 కుక్కల్ని వదిలిన డ్రగ్స్ ముఠా.. పలువురు పోలీసులకు గాయాలు

డ్రగ్స్ అక్రమ తరలింపులు చేస్తున్న ముఠాను పట్టుకోవటానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కల్ని వదిలింది డ్రగ్స్ ముఠా.కుక్కల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

Police injured in dog attack after drug gang released dogs : 

Police injured in dog attack after drug gang released dogs : హైదరాబాద్ అడ్డాగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ తరలింపులు ఏమాత్రం ఆగటంలేదు. చదువుకున్నవారే డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్నారు. దీనికోసం టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆన్ లైన్ లో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ఈ డ్రగ్స్ దందాలపై పక్కా సమాచారంతో పోలీసులు ముఠాలపై దాడికి యత్నించగా ఏకంగా పోలీసులపైనే కుక్కలను వదిలారు డ్రగ్స్ దందా ముఠా. పోలీసులపై ఒకటీ రెండు కాదు ఏకంగా 100 కుక్కలను వదిలారు. దీంతో కుక్కల దాడిలో పలువురు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

దందా ముఠా డార్క్ నెట్ వెబ్ ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఇద్దరు సప్లైయర్స్, ఆరుగురు పెడ్లర్స్ లను అరెస్ట్ చేశారు. కీలక నేత నరేందర్ నాయయణను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాని పట్టుకోవటానికి యత్నిస్తుండగా పోలీసులపైకి 100 కుక్కలను వదిలారు. కుక్కల చేసిన దాడిలో పలువురు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.