అసలేం జరిగింది : ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య
ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ రేఖ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని చనిపోయాడు. తమిళనాడులోని పెరంబూరులో శనివారం(డిసెంబర్ 28,2019) ఈ ఘటన జరిగింది.

ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ రేఖ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని చనిపోయాడు. తమిళనాడులోని పెరంబూరులో శనివారం(డిసెంబర్ 28,2019) ఈ ఘటన జరిగింది.
ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ రేఖ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని చనిపోయాడు. తమిళనాడులోని పెరంబూరులో శనివారం(డిసెంబర్ 28,2019) ఈ ఘటన జరిగింది. పెరంబూరు, నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపీనాథ్ (39) ఓ ప్రైవేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య రేఖ బుల్లి తెర నటి, యాంకర్. పదేళ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.
6 నెలల క్రితం గోపీనాథ్ జేజే నగర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే విషయమై గత బుధవారం(డిసెంబర్ 25,2019) కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
క్రిస్మస్ రోజున ఆఫీస్ కి సెలవు. అయినా ఆ రోజు గోపీనాథ్ ఆఫీస్ వెళ్లాడు. అక్కడే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మరుసటి రోజు గురువారం(డిసెంబర్ 26,2019) ఉద్యోగులు వచ్చి చూడగా.. గోపీనాథ్ ఉరేసుకుని ఉండటాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన జేజే నగర్ పోలీసులు మృతదేహాన్ని కీల్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
భార్య రేఖతో గొడవ కారణంగానే గోపీనాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అలాగే ఆయనకు అప్పుల బాధ కూడా ఉన్నట్లు విచారణలో కనుగొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. గోపీనాథ్ మృతికి అసలు కారణం ఏంటో తేల్చే పనిలో పడ్డారు.
Also Read : రెండేళ్లుగా చెల్లిపై అన్న అత్యాచారం : తెలంగాణలో మరో ఘోరం