పబ్జీ గేమ్ ద్వారా ఓ బాలికకు వల వేద్దామని అనుకున్న యువకుడి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే…
హైదరాబాద్ నాంపల్లికి చెందిన సల్మాన్..పబ్జీ గేమ్ ద్వారా ఓ బాలికకు వల వేశాడు. వాట్సాప్ నెంబర్ ద్వారా చాట్ చేసి బాలిక వివరాలను తెలుసుకున్నాడు. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ఫొటోలను తీసుకున్నాడు. ప్రేమిస్తున్నాంటూ..తనతో గడపాలని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. లేకపోతే..ఫొటోలు, ఇతరత్రా సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు.
దీంతో బాలిక భయపడి విషయాన్ని ధైర్యంగా పేరెంట్స్‌కి తెలిపింది. వెంటనే వారు..సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు..సల్మాన్ మొబైల్ ఆధారంగా విచారణ చేపట్టారు.
ఎక్కడున్నాడో తెలుసుకున్న పోలీసులు..సల్మాన్‌ను అరెస్టు చేసి..రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేశారనే దానిపై సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు. పబ్జీ గేమ్‌కు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని, అలాగే..సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read More : visakha utsav 2019..ప్రారంభించిన సీఎం జగన్