Rajasthan
Woman Gangraped : కామాంధులు రెచ్చిపోతున్నారు. పసికందులు..వృద్ధులను కూడా వదలడం లేదు. వారిపై అత్యాచారాలకు పాల్పడుతూ..దారుణాలకు తెగబడుతున్నారు. భర్తతో వెళుతున్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భర్త కళ్లెదుటే…అత్యాచారాలు చేస్తూ..సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు కొంతమంది కామాంధులు. రోడ్డుపై వెళుతున్న భార్య..భర్తలను అడ్డగించి..అమానుషానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
Read More : Fully vaccinated Hyd: హైదరాబాద్‌లో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్.. తెలంగాణ ప్రభుత్వం ఫోకస్!
రాజస్థాన్ రాష్ట్రంలోని బాడ్మెర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు మంగళవారం బలోత్రాకు బైక్ మీద బయలుదేరారు. మహిళపై ముగ్గురు కామాంధుల కన్ను పడింది. ఇంకేముంది..వారిని వెంటాడారు. బైక్ ను ఓ ప్రాంతం వద్ద అడ్డగించారు. నిందితుల్లో..ఒకరు..బాధిత మహిళ భర్త బైక్ ను తీసుకుని ఉడాయించాడు. ఏదో ప్రమాదం జరుగుతుందని ఊహించారు భార్య భర్తలు.
Read More : Drinking Water : మంచినీరు త్రాగే సమయంలో ఈ నియమాలు పాటించకుంటే…..
వారిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. ముగ్గురు వ్యక్తులు ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. తమను వదిలేయాలని..ప్రాదేయపడ్డారు. అయినా…వారు కనికరించలేదు. భార్యభర్తలిద్దరినీ కారులో ఎక్కించారు. భర్తను బంధించి.. అనంతరం ఒక్కొక్కరుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వదిలేశారు. వీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులు (కమ్తాయ్, నరేష్, బాబులాల్)లను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.