నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో ఒంటిరిగా నిద్రిస్తున్న బాలికపై కరుణాకర్ రెడ్డి అనే యువకుడు అత్యాచారం చేశాడు. చికిత్స కో్సం బాలికను మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బాధితురాలు, కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడు కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుకున్నారు. ఎవరూ లేని సమయంలో కరుణాకర్ రెడ్డి బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. రాత్రి 11.30 సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన అమ్మాయి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాద చేశారు. అయితే అర్ధరాత్రి కావడంతో కేసు నమోదు చేయలేదు.
తెల్లవారుజామున పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పోలీసులు సెటిల్ మెంట్ లాంటి చర్యలు చేయకూడదన్నారు. కరుణాకర్ రెడ్డికు కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కరుణాకర్ రెడ్డి ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీలో దిశ చట్టం తీసుకొచ్చాక కూడా మానవమృగాళ్లు భయం లేకుండా చెలరేగిపోతున్నారు.
మహిళలపై జరుగతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. దేశంలో అనునిత్యం ఏదోఒక మూలన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతునే ఉన్నారు. ఇటీవలే తెలంగాణలో దిశ అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనపై యావత్తు దేశం నిరసన గళం వినిపించింది. నిందితులను ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేసింది. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగినా తర్వాత అయినా కామాంధులు మారుతారేమోనని అందరూ భావించారు. కానీ మృగాళ్లళ్లో మార్పు రావడం లేదు. యథావిధిగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దిశ ఘటన జరిగిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.