ఎమ్మెల్యే లాస్య నందిత దుర్ఘటన మరవక ముందే.. మరో రెండు కారు ప్రమాదాలు

బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్ఘటన జరిగి 24 గంటల గడవకముందే హైదరాబాద్‌లో మరో రెండు కారు ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపింది.

Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయి 24 గంటల గడవకముందే హైదరాబాద్‌లో మరో రెండు కారు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నార్సింగ్ ప్రాంతంలో జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో ఇద్దరు గాయపడ్డారు.

సైకిల్ ట్రాక్ పైకి దూసుకెళ్లిన కారు
సోలార్ సైకిల్ ట్రాక్ పైకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు దూసుకొచ్చిన ఘటన నాన‌క్‌రామ్‌గూడ‌లో ఈ తెల్లవారుజామున 4 గంటలకు చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి సైకిల్ ట్రాక్ పైకి దూసుకెళ్లింది. సైకిల్ ట్రాక్‌పై ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నార్సింగ్ లో మరో రోడ్డు ప్రమాదం..
గోల్కొండ తారామతి వద్ద డివైడర్‌ను ఢీ కొట్టి కారు పల్టీ కొట్టింది. అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయపడడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: కారు ప్రమాదానికి ముందు అసలేం జరిగింది, లాస్య నందిత ఏం చేశారు.. 3 గంటలు అక్కడే ఎందుకున్నారు?

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామేశ్వరం బండ సమీపంలోని ఔటర్ రింగ్గ్‌రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే జి. లాస్య నందిత (37) ప్రాణాలు కోల్పోయారు. కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు