ఎర్రచందనం స్మగ్లింగ్ : తమిళనాడుకు చెందిన ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు

  • Publish Date - May 7, 2019 / 03:28 PM IST

కడప జిల్లా రాజంపేట రోళ్లమడుగు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 60 ఎర్రచందనం దుంగలు, 10 గొడ్డళ్లు, రంపాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

రాజంపేట రోళ్లమడుగు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు మూడు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అధికారులకు కనిపించారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు అధికారులపై దాడి చేశారు. దీంతో తమిళనాడుకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బీటెక్ విద్యార్థి ఉండటం గమనార్షం. ఎర్రచందనం స్మగ్లింగ్ లాభసాటిగా ఉండటంతో చదువుకున్న తమిళనాడు యువత అడవుల బాట పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.