Car Accident
Road Accident : పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు తెల్లవారు ఝమున విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు వద్ద కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు. నిడమర్రు మండలం, మందలపర్రు వద్ద తెల్లవారుఝుమున ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. కారుతో ప్రయాణిస్తున్న ఇద్దుర వ్యక్తులు అక్కడి కక్కడే ఊపిరాడక మరణించారు. మరిణించిన వారిని సుమంత్(35) శరత్ గా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.