బొలెరో ఢీకొని బాలిక మృతి

  • Publish Date - September 19, 2019 / 01:04 PM IST

హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం  చోటుచేసుకుంది.  కూకట్ పల్లి ఆస్బెస్టాస్ ఏవీబీ పురంలో  స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న చిన్నారిని బోలెరో వాహనం ఢీ కోట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మరణించింది.

స్ధానిక సెయింట్ రీటా హైస్కూలులో  రెండవ తరగతి చదువుతున్న రిషిత అనే చిన్నారి గురువారం సాయంత్రం స్కూలు అయిపోయాక ఇంటికి తిరగి వెళుతుండగా ఈ ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో రిషిత తలకు బలంగా  దెబ్బ తగలటంతో మృతి చెందింది.  

చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.