ఏపీ స్టేట్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మే 11వ తేదీ మధ్యాహ్నం వెల్దుర్తి క్రాస్ రోడ్డు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. 15 మంది చనిపోయారు. మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రాస్ రోడ్డు దగ్గర తుఫాన్ వెహికల్ – ప్రైవేట్ ట్రావెల్స్ – బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి ఆరోగ్యం విషమంగా ఉంది. మరో 10 మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. వీరిని వెల్దుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మృతుల్లో ఎక్కువ మంది తుఫాన్ వెహికల్ లో ప్రయాణిస్తున్నవారే. డోన్ నుంచి కర్నూలు వస్తుండగా వెల్దుర్తి క్రాస్ రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్నది. వాహనాలు వేగంగా ఢీకొనటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అతి వేగం, క్రాస్ రోడ్డు దగ్గర వాహనాల డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన 15 మంది తుఫాన్ వాహనంలో ఇవాళ ఉదయం వెల్దుర్తి సమీపంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం గుంతకల్లులో పెళ్లి చూపులకు వెళ్లి వస్తున్నారు. మార్గంమధ్యలో కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి క్రాస్ రోడ్ దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరు అతివేగంతో వెళ్తున్న ఎస్ఆర్ ఎస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. బైక్ ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
దీంతో తుఫాన్ లో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు చనిపోయారు. చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు. మొత్తం 15 మంది చనినపోయారు.
తుఫాన్ వాహనం నుజ్జు అయింది. వాహనంలో నలుగురు వ్యక్తులు చిక్కుపోయారు. ఘటనకు కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు అంటున్నారు. మృతులు నాగరాజు, గోపి, చింతలన్న, రంగన్న, వెంకటన్న, తిక్కయ్య, విజయ్, భాస్కర్ గా గుర్తించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని గద్వాల కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.