రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు.
జైపూర్ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కు 13 మందిని బలి తీసుకుంది. ప్రతాప్‌గఢ్ సమీపంలో ఓ ట్రక్కు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారి -131 పై నడుచుకుంటూ వెళ్తున్న వారి పైనుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల బంధువులు భోరున విలపిస్తున్నారు.