బస్సులో రూ.54 లక్షల చోరీ

ప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది.

  • Publish Date - September 7, 2019 / 08:00 AM IST

ప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది.

ప్రైవేటు బస్సులో తీసుకెళ్తున్న రూ.54 లక్షలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది. చుంచుపల్లి మండలం నర్కొండకర్ ఎన్కే నగర్‌కు చెందిన వ్యాపారి అట్లూరి మురళీకృష్ణ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో భూమి కొనేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం హైదరబాద్‌లోని వ్యాపార లావాదేవీల నుంచి రూ.54 లక్షలు సమకూర్చుకుని శుక్రవారం (సెప్టెంబర్6, 2019) ప్రైవేటు బస్సులో తిరుగు పయనమయ్యాడు. 

నగదు ఉన్న బ్రీఫ్‌కేస్‌ను బస్సులోని లగేజ్ అమర్చేస్థానంలో పెట్టాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆ బ్రీఫ్ కేసును తెరిచి అందులోని నగదు మొత్తాన్ని అపహరించారు. విద్యానగర్‌లో బస్సు దిగేందుకు సిద్ధం కాగా, బ్రీఫ్‌కేస్ బరువు తగ్గడంతో అనుమానం వచ్చి చూడగా అందులో డబ్బు మాయమైంది. ఈ మేరకు మురళీకృష్ణ చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Also Read : గోదావరి జిల్లాలకు వరద ముప్పు